పవన్కళ్యాణ్ బసచేసిన నో వేటెల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూపులు చూశారు. పవన్ కళ్యాణ్ ను ఆదివారం సాయంత్రమే నగరం విడిచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ ఇంకా హోటల్ లోనే ఉన్నారు. ఏదో జరుగుతుందనే అనుమానంతో భారీగా అభిమానులు హోటల్ వద్దకు చేరుకున్నారు. భారీగా తరలి వచ్చిన అభిమానులకు పవన్ కళ్యాణ్ హోటల్ పైనుంచి అభివాదం చేశారు. అంతా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. దీంతో తమ అభిమాన నాయకుడు అభివాదం చేయడంతో అభిమానులు ఉప్పొంగి పోయారు.