మర్రిపాలెం రైల్వే స్టేషన్ హల్ట్ వద్ద రైల్వే ట్రాక్ పై వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సోమవారం ప్రయాణికులు గుర్తించారు. దీంతో విషయాన్ని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్. పి. ఎఫ్ హెచ్. సి కే. ఆర్. కే రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పొద్దున్నే ట్రాక్‌పై నుండి తొలగించి 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉండి సమాధానం చెప్పలేక పోతున్నారని అతని వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.