యూపీలో 3 రోజుల క్రితం జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ చర్చనీయాంశంగా మారింది. బీఎండబ్ల్యు కారులో ఇద్దరు యువకులు అతి వేగంగా వెళ్లారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి 230 కిలోమీటర్ల వేగంతో కారును పోనిచ్చాడు. 300 కిలోమీటర్ల వేగంతో కారును పోనిస్తానని తన ఫ్రెండ్‌కి చెప్పాడు. అంత వేగంగా వెళ్తే చచ్చిపోతాం రా అంటూ అతడి ఫ్రెండ్ వారించాడు. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వినలేదు. అదే స్పీడులో పోనిచ్చి ఓ ట్రక్కును గుద్దేశాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాద సమయంలో వారు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతివేగంగా పోనిచ్చిన యువకుడి తీరును తప్పుబడుతున్నారు.