పసుపు, సెనగ పిండి, పచ్చి పాలను సమపాళ్లలో కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మ ఛాయ మెరుగుపడుతుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా చేస్తాయి. పసుపుని ముఖానికి రాసి, 10 నిమిషాల తర్వాత కడగాలి. అలా కాకుండా పసుపు, బియ్యప్పిండి, చెంచా చొప్పున పచ్చి పాలు, టొమాటో రసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడకు రాస్తే కళ్ల కింది నల్లటి వలయాలు, ముడతలు పోతాయి.