తెలంగాణ ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 21న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 21 నుంచి 23వ తేదీ మధ్యలో వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఈ నెల 26న సీట్లను కేటాయింపు, ఈ నెల 26 నుంచి 28వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. అప్పుడే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి.