ఉక్రెయిన్ అంతటా రష్యా దాడులు ముమ్మరం చేసింది. సోమవారం రాజధాని కీవ్‌లో కమికేజ్ డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. ఇదిలా ఉండగా సరిహద్దులో రష్యా యుద్ధ విమానం కూలిపోయింది. నైరుతి రష్యాలోని యెయిస్క్‌లోని నివాస ప్రాంతాన్ని ఆ యుద్ధ విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 11 మంది గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa