ప్రియుడిని చీకటి గదిలో బంధించి పెళ్లాడిందో యువతి. షిల్లాంగ్ ఐఐఎంలో సుజాత, గణేష్ శంకర్ ఎంబీఏ చేశారు. ఐదేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులో గూగుల్ మేనేజర్ అయిన గణేష్ భోపాల్లోని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వారు మర్యాదలు చేసి, అతడికి మత్తు మందిచ్చారు. ఆపై చీకటి గదిలో బంధించి, బలవంతంగా సుజాతకు తాళి కట్టించారు. రూ.40 లక్షలు బ్లాక్మెయిల్ చేయడంతో బాధితుడు పోలీస్ కేసు పెట్టాడు.