విశాఖపట్నం ఉదంతం మీద ఇప్పటికే ఎన్నో గందరగోళాలు రాగ తాజాగా దీనిపై టీడీపీ నాయకులూ కూడా స్పందించారు. విశాఖ విమానాశ్రయం లో జనసేన నేతలు, కార్యకర్తలు చాలా హుందాగా వ్యవహరించారని మంత్రులు ఎయిర్ పోర్టుకి వచ్చే సమయంలో తాను అక్కడే ఉన్నానని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైసీపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులను రెచ్చగొట్టారన్నారు. మంత్రి రోజా వేలు చూపించారని.. దానికి అర్థం ఏంటో ఆమె చెప్పాలని అన్నారు. అలాగే మిగతా మంత్రులు కూడా జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని.. ఈ నేపథ్యంలో చిన్న ఘర్షణ జరిగి ఉండవచ్చునని.. దాన్ని చూపించి జనసైనికులను పోలీసులు అరెస్టు చేసి, కేసులు పెట్టారని ఆరోపించారు.