ప్రస్తుతం అంతా ఉరుకులు పరుగులు మీద పనులు చేస్తుంటారు. ముఖ్యంగా నగరాలలో రన్నింగ్ బస్సులను ఎక్కడం, దిగడం సర్వసాధారణమే. ట్రైన్‌ల విషయంలోనూ చాలా మంది ఇలాగే చేస్తారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రన్నింగ్ ట్రైన్ నుంచి దిగబోయాడు. అయితే పట్టుతప్పి పడిపోయాడు. అతడిని ప్లాట్‌ఫారంపై రైలు ఈడ్చుకుపోయింది. అదృష్టవశాత్తూ అతడి ప్రాణాలు దక్కాయి. ఈ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబై అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa