ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి కిసాన్ నిధిని వేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ముఖ్యమంత్రి సభలో ప్రధాని ఇస్తున్న నిధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు కేంద్రం పేరు చెప్పకపోవడం సబబు కాదన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.