ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బాయిలను చితక్కొట్టిన నర్సులు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 01:30 PM

బీహార్‌లోని సరన్ జిల్లాలోని చప్రా జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు నర్సులు దారుణంగా ప్రవర్తించారు. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవని భావించిన ఇద్దరు యువకులు పరిసరాలను వీడియో తీశారు. ఇది గమనించిన నర్సులు ఆ ఇద్దరు అబ్బాయిలను నిర్బంధించారు. ఆపై కర్రలు తీసుకుని వారిని చితకబాదారు. మెడికల్ సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆ యువకులు ఆసుపత్రి పరిసరాలను వీడియో తీసినట్లు తేలింది. ఇక బాధిత యువకులు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వారిని కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ నర్సులపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com