మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత వైసీపీ పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. నన్ను ప్యాకేజీ అని ఇంకో సరి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని మాట్లాడటం జరిగింది. దీనిపై మంత్రి అప్పలరాజు స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకున్నాడు.. ఆయన జీవితం ‘మూడు’ చుట్టూనే తిరుగుతోంది.. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇంటర్లో 3 గ్రూపులు జాయిన్ అయ్యాడు.. 3 పార్టీలతో జతకట్టాడు.. 3 పెళ్లిళ్లు చేసుకోవడం గొప్పలాగా పవన్ మాట్లాడుతున్నాడు అని వాపోయారు.