మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు అలానే పొత్తులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానన్నారు. ‘‘బీజేపీ తో ఎలయెన్స్ కుదిరినా ... ఎక్కడో బలంగా పనిచేయలేదన్న భావన కనపడుతోంది. అది రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసు... మాకు తెలుసు. రోడ్డు మ్యాప్ అడిగింది కేవలం మీతో కలిసి వెళ్లడానికే. కానీ, మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆరాటపడడు. ఇవాల రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే , గూండాలు గదమాయిస్తుంటే నా ప్రజలను రక్షించుకోవడానికి నా వ్యూహాలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అంతమాత్రాన నేను ప్రధానమంత్రికి కానీ, బీజేపీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు... పూర్తి గౌరవం. ఎప్పుడు కలుస్తాం... ఎప్పుడు ముందుకు తీసుకెళతాం .... అలాని చెప్పి ఊడిగం చేయం’’ అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.