జగనన్న శాశ్వత భూ హక్కుల పరిరక్షణ కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ మంగళవారం సమీక్షించారు. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల భూసమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేందుకు రీసర్వే జరగాలి. పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని, 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 15,02,392 ఎకరాలను సర్వే చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.