కేపీటీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పరీక్ష స్కామ్లో నిందితుడు సంజీవ్ భండారీ ని అరెస్ట్ చేసారు. తాజాగా సంజీవ్ భండారీ బెయిల్పై హిండల్గా జైలు నుండి విడుదలయ్యాడు, అయితే సిఐడి అధికారులు అతన్ని జైలు ముందు మళ్లీ అరెస్టు చేశారు. 2021లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నిందితులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులు సంజీవ్ భండారీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సీఐడీ అధికారులు సంజీవ్ భండారీని బెల్గాంలోని 5వ జేఎంఎఫ్సీ కోర్టులో హాజరుపరిచారు. ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేపీటీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు 7న గోకాక్లో పరీక్ష జరిగింది.