టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. అజహర్ తండ్రి మహ్మద్ యూసుఫ్ మంగళవారం మృతి చెందాడు. యూసుఫ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం బంజారాహిల్స్‌లోని మసీద్ ఇ బాకీ జోహార్ లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసుఫ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.