ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' కొనసాగుతోంది. అమరావతి రైతులు మంగళవారం రాహుల్ గాంధీని కలిశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పిన రాహుల్‌గాంధీ, అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. పోలవరం, అమరావతి సమస్యలు పరిష్కరిస్తామని, ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారు.