ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడ్కో ఇళ్ళను చేజార్చుకోవద్దు: ఎమ్మెల్యే ఆర్కే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 02:44 PM

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ కారణాలతో టిడ్కో ఇళ్ళ కోసం బ్యాంక్ లోన్ రాని వారితో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ హనుమంతరావు తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గతంలో ఉన్న పాత లోన్లు బకాయిలు వెంటనే చెల్లిస్తే టిడ్కో ఇంటి కోసం లోన్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని అన్నారు.

సాధారణంగా ఒక లోన్ పూర్తయిన తర్వాత బ్యాంక్ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మూడు నెలల కాలం పడుతుందని అయితే అధికారులతో కలిసి అవసరమైతే తాను మరియు ఎమ్మెల్సీ హనుమంతరావు బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేసి త్వరిత గతిన ‘‘నో అబ్జెక్షన్’’ సర్టిఫికెట్ వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. మంగళగిరి నడిబొడ్డున పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించి టిడ్కో ఇళ్లను ఏ ఒక్కరూ కోల్పోవడం తమకు ఇష్టం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com