ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపులను గంపగుత్తగా తీసుకెళ్లి చంద్రబాబుకు అప్పగించడం పవన్‌ కల్యాణ్‌ అంతిమలక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 03:04 PM

నిన్నటి వరకు బీరాలు పలికిన దత్తపుత్రుడు ముసుగు ఇవాళ తొలగించాడు.  ఈ ముసుగు వెనకాల చంద్రబాబుకు గులాం గిరి ఉంది. ప్రజలను, తన అభిమాన సంఘాలను మోసం చేసే ప్రక్రియ ముసుగుచాటున చేస్తున్నాడు. జనసేన అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా కాపులను గంపగుత్తగా తీసుకెళ్లి  చంద్రబాబుకు అప్పగించడం పవన్‌ కల్యాణ్‌ అంతిమలక్ష్యం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ చీకటి బంధం గురించి వైయస్‌ఆర్‌ సీపీ మొదటిరోజు నుంచి చెబుతుంది ఇవాళ నిజమైందని, దత్తపుత్రుడు ముసుగు తొలగించడం సంతోషం అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని, చంద్రబాబు పంచన చేరుతున్నానని సన్నాసిన్నర సన్నాసి చెప్పకనే చెప్పాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com