బ్రిటన్‌లో ఆహార సంక్షోభం విపరీతంగా ఉంది. రోజంతా ఆకలితో అలమటించేవారి సంఖ్య లక్షల్లో ఉంది. కొద్ది నెలల నుంచి ఈ సమస్య కనిపిస్తున్నా, తాజాగా జీవన వ్యయం సంక్షోభం తీవ్రమవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఫుడ్ ఫౌండేషన్ చారిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఫుడ్ ఫౌండేషన్ చారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నారు. ఈ దుస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోందన్నారు. యూనివర్సల్ క్రెడిట్‌ను పొందుతున్న అన్ని కుటుంబాలకు పాఠశాలల్లో ఉచిత భోజనం పొందడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ అర్హత కల్పిస్తే ఆహారం అవసరం ఎక్కువగా ఉన్నవారికి మద్దతు లభిస్తుందన్నారు.