మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. అంగన్ వాడీలకు, సూపర్ వైజర్లకు, మొత్తంగా దాదాపు 57వేల మందికి సెల్ ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్ వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్ పోన్స్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.