శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి లో చేనేత కార్మికుల సమస్యల పై మండల కార్యదర్శి జి. రాజగోపాల్ ఆధ్వర్యంలో పెనుకొండ సబ్ కలెక్టర్ క్. కార్తీక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఏపీ చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజ గోపాల్ మాట్లాడుతూ గత నెల రోజుల నుండి కురుస్తున్న అధిక వర్షాల వలన మగ్గం గుంతలలో నీరు చేరడం వలన ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి రమేష్, మండల చేనేత నాయకులు చాంద్ బాషా, ఎం వెంకటేశ్వర్లు, బాలస్వామి, చేనేత కార్మికులు శీనా నాయక్, రామాంజి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.