చోడవరం మండలం చిత్తాడ గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర అనుప మహోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో ఉన్న కాళ్ళ చంద్ర పరమేష్ ఇంటిలో పెట్టి తొమ్మిది రోజులు పూజా విధానాలు జరిపించి, బుధవారం రాత్రి అమ్మవారిని ఊరేగింపుగా ఊరంతా తిప్పడం జరిగింది. అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఆర్థిక కార్యక్రమాలు చంద్ర పరమేశ్వరి చూసుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.