ప్లాస్టిక్ రహిత జిల్లాగా పల్నాడును తీర్చిదిద్దేందుకు ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రింటింగ్ వ్యాపారులు సహకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ బుధవారం అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ. నవంబర్ ఒకటవ తేదీ నుండి జిల్లాలో ప్లాస్టిక్ బ్యానర్ల ప్రింటింగ్ కార్యకలాపాలను నిలుపుదల చేయాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్లాత్ బ్యానర్ల ముద్రణకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులకు సూచించారు.