ఫిరంగిపురం మండలంలోని వేమవరం అడ్డ రోడ్డు వద్దనున్న అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ఉదయాన్నే అభిషేకాలు నిర్వహించి నాగవల్లీ దళాలతో అష్టోత్తర, సహస్రనామ పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రెండువేల మందికి భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కావించారు.