ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటి పేరును మార్చడానికి నిరసిస్తూ రాజంపేటలో మూడవ రోజు టిడిపి దీక్షలు కొనసాగాయి యూనివర్శిటీ పేరు మార్పు కుట్ర పూరితంగానే జరిగాయని నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చెంగల రాయిడు జగన్ ప్రబుత్వం పై మండి పడ్డారు. రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా అంబేడ్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న ఈ రిలే దీక్షలో గురువారం పలువురు టిడిపి నాయికులు జగన్ ప్రబుత్వం చేసే కుట్ర పూరిత రాజకీయాలపై విరుచకపడ్డారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం, వంటిమిట్ట , మండల టిడిపి నాయికులు, పార్లమెంట్ కార్యదర్శి నాగమునిరెడ్డి , సోమలరాజు చంద్రశేఖర్ రాజు, రెండు మండలాల కార్యకర్తలు భారిగా హజరయ్యారు.