ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు మరో కరోనా వేవ్ కు కారణమయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఓమిక్రాన్ XBB సబ్ వేరియంట్ కారణంగా మరోక ఇన్ఫెక్షన్ చూడవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఓమిక్రాన్ లో ఇప్పటి వరకు 300కు పైగా సబ్ వేరియంట్లను గుర్తించామన్నారు. కరోనా ఇంకా అంతం కాలేదని, నివారణ చర్యలు కొనసాగించాలని, టీకాల పంపిణీ కొనసాగించాలని, మాస్కులు ధరించాలని కోరారు.