20-10-2022 సాయంత్రం గం 5.30 ని. లకు కాకినాడ జిల్లా పరిధిలోని చొల్లంగి గ్రామం లో మడ ఫారెస్ట్ గేటు వద్ద సుమారు 10 సం. బాలిక ఒంటరిగా రోడ్ పై ఉండగా పొలీసు వారికి 112 కాల్ రాగా కోరింగ SI గారు వారి సిబ్బందిని వెంట తీసుకుని సదరు ప్రదేశానికి వెళ్లి బాలిక గురించి, చొల్లంగి గ్రామ మహిళ పొలీసు మరియు అంగన్వాడీ వర్కర్ ల సహాయంతో సదరు బాలిక గురించి ఆరా తీయగా సదరు బాలిక చెవిటి మరియు మూగ అయినందున , తన పేరు ను ఒడియా భాషలో చిన్ని అని వ్రాసింది. అంతట సదరు బాలిక గురించి ICDS Project, CDPO వంజం మాధవి గారికి తెలియపరచినారు. ఈ బాలిక తెలిసిన వారు పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. బాలిక సంరక్షణ నిమిత్తం శ్రీ దుర్గ మల్లేశ్వర ఆశ్రమం కోరింగ నందు WPC 3773 మరియు అంగన్వాడి వర్కర్స్ సంరక్షణలో ఉంచడమైనది. బాలిక గురించి వివరాలు ఏమైనా తెలిసిన యెడల ఈ క్రింద నెంబర్లకు ఫోన్ చేయగలరు అని తెలియజేసారు.
Circle inspector,Kakinada rural. 9440796521
SI of police, Coringa PS 9440796558.
V.Madhavi CDPO 9491369118