బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించారు. కానీ బైక్ అదుపుతప్పడంతో బైక్ తో సహా యువకులు నీటిలో పడిపోయారు. బైక్, ఓ యువకుడు నీటిలో కొట్టుకుపోగా, మరో యువకుడికి స్థానికులు కాపాడారు. అదృష్టవశాత్తూ నీటిలో కొట్టుకుపోయిన యువకుడు కూడా కొంత దూరం వెళ్లాక గట్టున చేరాడు. దీంతో ఆ యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో గత 3 రోజులుగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa