తెనాలి: శలపాడుకు చెందిన 19 సంవత్సరాల ఓ యువతి పట్టణంలోని సుల్తానాబాద్ నర్సింగ్ కళాశాలలో చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం వసతిగృహం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని గురువారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.