లాలాపేట చిన్న బజార్ లోని ఒక ఇంటిలో గురువారం చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు. చిన్న బజారుకు చెందిన ఫాతిమా, భర్త జానీ భాషాలు ఈనెల 19న గుడివాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారపు గొలుసు, 4 ఉంగరాలు, చెవి దిద్దులు, రెండు జతల పట్టిలు, 5 వేల నగదు చోరీ చేశారు. ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.