ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ICC T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16న ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతుండగా, సూపర్-12 మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్-12 తొలి మ్యాచ్ ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 22న ఈ మ్యాచ్ జరగనుండగా, 23న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టీ20 ప్రపంచకప్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ వార్మప్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. శనివారం జరగనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు.. మరుసటి రోజు జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశం లేకపోలేదు. అక్టోబర్ 22న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. గత సంవత్సరం, ఆస్ట్రేలియా ICC T20 వరల్డ్ 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, పొట్టి ఫార్మాట్‌లో వారి తొలి ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయింది. అయితే సిడ్నీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1 నుండి 3 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం 80% ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం అక్టోబర్ 23న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గత నెలలో జరిగిన ఆసియాకప్ తర్వాత ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించారు. అయితే సిడ్నీలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువ (90%) జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం" అని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.