గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు లో గురువారంఈ-క్రాప్ నమోదును టెక్నికల్ ఏవో సునీల్, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పంటలన్నీ పరిశీలించారు. ఈ క్రాప్ లో నమోదు చేసిన విధంగా క్షేత్రస్థాయిలో పంటలు ఉన్నాయా. ప్రస్తుతం పంటల్లో సమస్యలు ఉన్నాయా అని పరిశీలించారు. అలానే రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.