విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... జగన్ రెడ్డి పోలీసులను వాడుకోవడమే కాదు, ఆదుకోవడం కూడా నేర్చుకోండి. కోవిడ్ సమయంలో కర్తవ్య నిర్వహణలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఇస్తామన్న రూ.10 లక్షల సాయం ఎవరికైనా ఇచ్చారా? వీక్లీ ఆఫ్, సరెండర్ లీవ్స్, టిఎ, డిఎ, ఫిట్మెంట్, జిపిఎఫ్ డబ్బులు, పోలీసు సంక్షేమ నిధులు వంటి బూటకపు హామీల్లో ఏదైనా నెరవేర్చారా? జగన్ రెడ్డి ధన దాహంతో, అధికార దాహంతో చేసే తప్పుడు పనులకు వత్తాసు పలుకుతున్న పోలీసులకు ప్రగాఢ సానుభూతి. ఈ నిరంకుశ ప్రభుత్వంలో పాలకులను, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను నిజాయితీగా ఎదుర్కుంటూ పనిచేస్తున్న, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న పోలీసులకు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు మరియు సెల్యూట్ అని తెలియజేసారు.