అంగన్వాడీలు మరింత బాధ్యతతో పనిచేయాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో లక్కిరెడ్డిపల్లె ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా అందచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన విద్యాబోధన అందాలన్నారు. గర్భిణీలకు, చిన్నారులకు బలవర్ధక ఆహారాన్ని సక్రమంగా అందించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, గౌస్ ఖాన్, సుగవాసి శ్యామ్, సున్నా , లక్కిరెడ్డిపల్లె సి డి పి ఓ పద్మావతి, సూపర్ వైజర్లు పద్మజ, తులసమ్మ, అరుణ, నాగసుబ్బమ్మ, రాజుబీ తదితరులు పాల్గొన్నారు.