బంగ్లాదేశ్ బరిషాల్ జిల్లా బందర్ ప్రాంతంలో గురువారం రాత్రి విచిత్ర ఘటన జరిగింది. స్థానిక కిరాణా దుకాణంలోకి ఓ దొంగ చొరబడ్డాడు. అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నించగా తెల్లవారి పోయింది. శుక్రవారం ఉదయం దుకాణం ముందు చాలా మంది గుమిగూడారు. వారు తనను కొట్టి చంపేస్తారేమోనని ఆ దొంగ భయపడ్డాడు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబరు 999కి ఫోన్ చేసి, తనను కాపాడాలని పోలీసులు సాయం అడిగాడు. పోలీసులు అతడిని రక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa