పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఎన్‌సిఎస్ యూనివర్శిటీలో ఇటీవల జరిగిన వేడుకలో ఓ యువతి చక్కటి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ర్యాప్, డ్యాన్స్ ద్వారా వేదికపై ఆమె ప్రతిభకు అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా డ్యాన్స్ చేయడం అనైతికమని ఎన్‌సిఎస్ యూనివర్శిటీకి నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.