ఏపీకి సిత్రాంగ్ తుఫాన్ ముప్పు ఇంకా తొలగలేదు. కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముప్పు ఉన్న 105 మండలాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రకటించారు. అందరికి అందుబాటులో ఉండేలా ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. 1070, 18004250101, 08632377118 నంబర్లలో సాయం కోసం సంప్రదించవచ్చు.