యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వద్ద కార్తీక మాసంలో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిత్యం ఆరు బ్యాచులు నిర్వహించబడుతుందని, ఆలయ ఈవో గీత తెలిపారు. శుక్రవారం వివరాలు చెబుతూ ఈనెల 26వ తేదీ నుండి వచ్చేనెల నవంబర్ 23వ తేదీ వరకు నిత్యం ఆరు బ్యాచులు కొనసాగుతాయని చెప్పారు. కొండకింద నూతన ఘాట్ రోడ్డు పక్కన గల నూతన వ్రత మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజలు జరుగుతాయి అన్నారు. ఉదయం 6: 30 నుండి 7: 30 కు మొదటి బ్యాచ్, 8: 30 నుండి 9: 30 వరకు రెండవ బ్యాచ్, 10: 30 నుండి 11: 30 వరకు మూడో బ్యాచ్, 12: 30 నుండి 1: 30 నిమిషంల వరకు నాలుగవ బ్యాచ్, 2: 30 నిమిషాల నుండి 3: 30 నిమిషాల వరకు ఐదవ బ్యాచ్, 4: 30 నుండి 5: 30 వరకు ఆరవ బ్యాచ్ కొనసాగుతాయని చెప్పారు. అదేవిధంగా పాత లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఐదు బ్యాచులు కొనసాగుతాయి అన్నారు. 7 గంటల నుండి 8 గంటల వరకు మొదటి బ్యాచ్, 9 గంటల నుండి 10 గంటల వరకు రెండవ బ్యాచ్, మధ్యాహ్నం 12 గంటల నుండి 1 వరకు మూడవ బ్యాచ్, 3: 30 నిమిషాల నుండి 4: 30 వరకు నాలుగవ బ్యాచ్ , సాయంత్రం 5నుండి 6 గంటల వరకు ఐదవ బ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పుణ్యఫలాలు పొందాలని కోరారు.