తెనాలి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై శుక్రవారం కేసు నమోదయింది. పోలీసుల కథనం మేరకు. పట్టణంలోని ఐతానగర్ కు చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లోకి పక్కింటి వ్యక్తి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు రావటంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ బి. కోటేశ్వరరావు తెలిపారు.