ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 12:35 PM

టెక్కలి నియోజకవర్గంలో జనసేన పార్టీ  కార్యాలయంపై కొంత మంది దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా దీనిపై బీజేపీ నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ...  దాడిని బీజేపీ పార్టీ   తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, వ్యక్తుల స్వేచ్ఛను హరించే స్థాయికి  సీఎం జగన్  ప్రభుత్వం ఎదిగింది.అధికారాన్ని అడ్డుపెట్టకుని అహంకార పూరితంగా సాగుతున్న మీ ధోరణి రాష్ట్ర ప్రజలు గ్రహించారు. దాడులు చేసి ఆఫీసులు ధ్వంసం చేసినంత మాత్రాన సామాన్య ప్రజలు , జనసేన బిజెపి శ్రేణులు భయపడరు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మీ పాలనకు ప్రతిఫలంగా సృష్టించే రాజకీయ విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యమంత్రి గారు అని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com