త్వరలో విశాఖ నుండి పాలన చేస్తాం అని షాడో సీఎం సజ్జల చెబుతున్నాడు. ఈ మూడున్నరేళ్ళూ అమరావతి నుండి వీళ్ళు చేసిన పాలన దెబ్బకి, అమరావతి రైతులు ఇళ్ళూ, పిల్లలూ, పండుగలూ అని లేకుండా రోడ్డున పడి తిరుగుతున్నారు అని టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. ఆమె మాట్లాడుతూ... ఇక విశాఖ ప్రజల వంతు అంటారు.. అంతేగా? తాడేపల్లిలో కూర్చొని ఇన్నాళ్ళూ రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించారని ఇప్పుడు విశాఖకు వచ్చి కొత్తగా ఉద్ధరించడానికి? సమర్ధుడు ఎక్కడ కూర్చున్నా పని చేస్తాడు. ఇవన్నీ టైం పాస్ వ్యవహారాలు.. ఏదో చేస్తున్నట్లు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప విశాఖ వచ్చినా చేసేది ఏమీ ఉండదు. పని తక్కువ ప్రచారమెక్కువ అని వ్యంగ్యంగా మాట్లాడారు.