తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షించడం కొరకు భక్తుల కోసం నడుపుతున్న ధర్మ రథాల (ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బా రెడ్డి తెలిపారు.ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు తిరుమల అన్నమయ్య భవనంలో ఒలెక్ట్రా కంపెని ప్రతినిధులు, ఆర్టిసి, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.