రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని దీంతో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని స్పష్టమౌతోందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. రెండో రోజు శనివారం చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.