2024 ఎన్నికల్లో మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగరాలని, ఇందు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మంత్రాలయంలోని హెచ్ఆర్ బీ కళ్యాణ మండపంలో జరిగిన రియల్ టైం స్టాటజీ ట్రైనింగ్ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గానీ చేసిందేమీలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.