విద్యార్థులకు సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా కేంద్రంలోని ఎస్. ఎస్. బి. ఎన్ డిగ్రీ కళాశాల యాజమాన్యంపై అధికారు లు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యద ర్శులు వేణుగోపాల్, వెంకట్ నాయక్ లు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ గుంతకల్లు పట్టణంలోని డాక్టర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, వెంకట్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాలలో చేరడా నికి అశోక్, సందీప్ రెడ్డి అను విద్యా ర్థులకు సీట్లు కేటాయిస్తే ఆ కళాశాల యాజమాన్యం సీట్లు ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి అఖిల్ నాయకులు ప్రసాద్, స్రవంత్, మోహన్, తేజ, లోకేష్, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.