శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద శనివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినందుకు నిరసనగా టీడీపీ గోరంట్ల మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ పద్ధతి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.