విద్యార్థులకు ప్రభుత్వం కేటాయించిన సీట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోన్న జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బి ఎన్ కళాశాల యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యూ నాయకులు గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలిలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల లో చేరడానికి అశోక్, సందీప్ రెడ్డి లకు సీట్లు కేటాయిస్తేకళాశాల యాజమాన్యం సీట్లు ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వెంటనే వారికి సీట్లు ఇవ్వా లని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు కిషోర్, పిడిఎస్యూ నాయ కులు రంగస్వామి, చందు, కిరణ్, దివాన్, జాక్, మోహన్, వంశీ, చరణ్ తదితులు పాల్గొన్నారు.