శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ ని గోరంట్ల మండలం వైసిపి నాయకులు దగ్ధం చేయడంతో దానికి నిరసనగా శనివారం అంబేద్కర్ విగ్రహం దగ్గర గోరంట్ల జనసేన నాయకులు మౌన పోరాటం చేశారు.
ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ దిష్టిబొమ్మలు కాల్చే దాని మీద ఉన్న శ్రద్ధ గోరంట్ల అభివృద్ధి పై చూపండి అని సూచించారు. చిత్రావతి నది పై వంతెన నిర్మించి ఆరు నెలలు కూడా పూర్తి కాగానే బ్రిడ్జి మీద గుంతలమయం కావడం మొదటిగా ఆ గుంతలు పూడ్చండి అని తెలిపారు.
హిందూపురం కదిరి ప్రధాన రహదారి కసిరెడ్డిపల్లి పెద్దవంకలో బ్రిడ్జి చిన్నదిగా ఉండటం వల్ల వర్షానికి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని వైసిపి నాయకులు వాటిపై దృష్టి పెట్టి కొత్త బ్రిడ్జి ఏర్పాటుకై పోరాడాలని అలా చేయకుండా నీతి నిజాయితీగల మా పవన్ కళ్యాణ్ మీద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని మీరు నిరూపించగలరా మీరు నిరూపిస్తే జనసేన పార్టీ వదిలేసి మేమంతా వైసీపీ పార్టీలో కొనసాగుతామని వారు సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల నాయకుడు సంతోష్, కార్యక్రమల జిల్లా కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, ఐటీ పెనుకొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, వీర మహిళ, కావేరి, మండల నాయకులు నాగేష్, నాగేంద్ర, మల్లికార్జున, నరేశ్, తిరుపాల్ వెలమద్ది శ్రీనివాస్, గంగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.