విజయనగరంలోని సంతకాల వంతెన వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న భవానీశంకర్(25) రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెంది నట్లు హెచ్‌సీ వీఎన్ మూర్తి తెలిపారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాల కోసం ప్రయత్నించారు. దీంతో మృతుడు విజయనగరంలోని బంకుల దిబ్బకు చెందిన భవానీశంకర్‌గా గుర్తించారు. మృతుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తు న్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa